బీసిలకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న జనాభాలొ సగానికి సాగానికి పైగా ఉన్న బీసిలకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో జరిగిన సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కలిపించే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. స్థానిక సంస్థలలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా కేబినేట్ ఆమోదం తెలిపింది.
హైకోర్ట్ ఆదేశాలు
హైకోర్ట్ ఇటివలే పంచాయతి ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను నెలాఖరులోగా ఖరారు చేయాలనీ ప్రభుత్వాని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం విటన్నిటిని చర్చించిన తరువాత మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికాల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ తీర్పుకు అనుగుణంగా బీసీ డేడికేటేడ్ కమిషన్ ను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం 42 % రిజర్వేషన్లను రాష్ట్ర ప్రణాళిక విభాగం అధ్వర్యంలో కుల గణన చేపట్టి రిజర్వేషన్ల బిల్లును ఆమోదించింది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా, జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తీర్మానించింది.
రాష్ట్ర యూనిట్ గా ఉన్న గ్రామ పంచాయితి సర్పంచ్, ఎంపిటిసిలకు మండలం యూనిట్ గా, ఎంపిపి,జెడ్పిటిసి లకు జిల్లా యూనిట్ గా, జెడ్పి చేర్మన్లకు రాష్ట్ర యూనిట్ గా బీసీ రిజర్వేషన్ల ను ఖరారు చేసింది. ఇదివరకే తెలంగాణ రాష్ట్రం లో అమలులో ఉన్న పంచాయితీరాజ్ చట్టం – 2018 బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగునగా చట్ట సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ చట్టంలో త్వరలో చేయవలసిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎయిమీటి యునివర్సిటి మరియు సెయింట్ మేరి రిహాబిలిటేషన్ యునివర్సిటీ అనే రెండు యునివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వ కేబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ ఆమోదం తెలిపిన ఎయిమిటి యునివర్సిటీలో మన తెలంగాణ విద్యార్ధులకు, మన స్థానిక విద్యార్ధులకు 50% అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం విధించింది.
ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి కుమార్తె అయిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత రావు రాష్ట్రంలో తెలంగాణ జాగృతిని నడుపుతునారు. దాంట్లో బాగంగానే 42% బీసీ రిజర్వేషన్ బిల్లును స్వాగతించారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందాన్ని వారికీ 42% రిజర్వేషన్ ను కేటాయించాలని ఈ బిల్లుకు కావాల్సిన అన్ని పార్టీల మద్దతు ఉందని తెలిపారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత 42% బీసీ బిల్లుకు పార్టీ పెద్దల సహాయక సహకారాలను కోరింది. బీసీ బిల్లు సాదన కోసం కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావడానికి జూలై 17న రైల్ రోకో కార్యక్రమం చెప్పటారు. ఈ రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపి ఆర్.క్రిష్నయ్య గారిని కలవడం జరిగింది. ఆర్.క్రిష్నయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం జరిగే ఏ పోరాటానికైనా అండగా ఉంటామని, ఎలాంటి కార్యక్రమానికైనా తమ మద్దతు ఉంటుందని ఆర్.క్రిష్నయ్య ప్రకటించారు. ఎంతో కాలంగా ఆర్.క్రిష్నయ్య బీసీ రిజర్వేషన్ ఉద్యమాలపై ఎన్నో పోరాటాలు చేసారు.
భారతీయ జనత పార్టీ
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ బీసీ బిల్లు పైన 42% బీసీలు ఉన్నారు దాంట్లో ముస్లింలను కూడా కలిపారని భారతీయ జనత పార్టీ వాదన. భారతీయ జనత పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ 42% బీసీలలొ ముస్లింలను కలుపడని వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. ఈ బిల్లును రాజ్యాంగం సవరించినాటు వంటి 9వ షెడ్యుల్ లో పెడితేనే నిలబడుతుంది. కానీ భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు డిల్లిలో బీసీ బిల్లు పైన మాట్లాడుతూ బీసీ బిల్లులో ముస్లింలను కలపడని వ్యతిరేకిస్తున్నారు.
ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న
రాష్ట్రలో ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) బీసీ ఉద్యమం ప్రారంభించారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను లేవనేతుతున్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న కొత్తగా ఉద్యోగ నోటిఫికేషాన్ ప్రక్రియ పైన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తరువాతనే ఉద్యోగ నియమంకం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనా చేసారు. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ ముందే 42% రిసర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఎలక్షన్లకు వెళ్ళాలని లేకుంటే రాష్ట్రంలో బీసీ ఉద్యమం తీవ్రత పెంచుతామని హెచ్చరించారు. 42% రిజర్వేషన్ ను 9వ షెడ్యుల్ లో పెడితేనే ఈ బిల్లు నిలబడుతుందని ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల పని తీరును సమీక్షించాలని ఆర్ధిక శాఖను మంత్రి వర్గం ఆదేశించింది. రాష్ట్రంలో ఉద్యోగుల హాజరుతో పాటు విదినిర్వహణలో జవబుధరితనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగాలను సంబంధించి నియమించిన అధికారుల కమిటి కి బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన
తెలంగాణలో వెనుక బడిన తరగతులకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసన సభ ఆమోదించిన బిల్లులకు చట్టబద్దత కల్పించాలని కేంద్రంపైన ఒత్తిడి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిల్లికి వెళ్ళినట్టు తెలిపారు.
బీసీలకు విద్యా,ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ల, అలాగే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను తెలంగాణ శాసన సభ పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదించిన ఈ రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో ఈ రెండు బిల్లుల రిజర్వేషన్లు ఖరారు చేయాలనీ తెలంగాణ హైకోర్ట్ ఆదేశించిన విషయం గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులు చట్ట సభల్లలో ఆమోదానికి కేంద్రపైన ఒత్తిడి తేచెందుకు లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ గారిని మరియు రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారిని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామజిక,ఆర్ధిక,విద్య ,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే నిర్వహించిన తీరును రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన శాస్త్రీయ విధానాలను వివరిస్తాం.
కేంద్రతో మిత్ర పక్షాలైన కూటమి భాగస్వామ్యా పక్షాలను కలిసి వారికీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే గురించి వివరించి బీసీలకు 42% రిజర్వేషన్ల సంబంధిన ఆమోదానికి కావలిసిన మద్దతును కోరుతాం. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
కొత్త మున్సిపాలిటిలు
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో రెండు కొత్త మున్సిపాలిటిలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు అయిన జిన్నారం, ఇంద్రిశం మున్సిపాలిటిల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయితిలను డి లిస్టింగ్ చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం మహాత్తర కార్యక్రమం గోవుల రక్షణకు పూనుకుంది. అధునాతంగా గోశాలాల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటి ఏర్పాటు చేయాలనీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కమిటి తన నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశంలోపు అందించాలని గడువు నిర్ణయించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల అనుగుణంగా పశుసంవర్ధక శాఖను రూపొందించారు. ఈ శాఖ రుపొందిన్చిన్న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను, కొత్త గా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రి వర్గ భేటిలో ప్రదర్శించారు. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 306 గోశాలలున్నాయి. హైదరాబాద్లో ఎన్కేపల్లి,వెటర్నరి యునివర్సిటి,వేములవాడ, యాదగిరి గుట్టలో అత్యాధునికంగా గోశాలల నిర్మనలు జరుగాలని నిర్ణయించారు. వీటితో సహా రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు , వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రుపొందించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
కొత్త సంప్రదాయం
తెలంగాణ రాష్ట్రంలో కాబినెట్ భేటిలకు సంబంధించి కొత్త సంప్రయయన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన కాబినెట్ సమావేశాలు మరియు వాటిలో తీసుకున్న నిర్ణయాల అమలుపైన సమీక్షా జరిపింది.రాష్ట్రంలో జరిగిన సమావేశాలు 2023 డిసెంబర్ 7వ తేది నుంచి ఇప్పటి వరకు 19 కాబినెట్ సమావేశాలు జరిగాయి. రాష్ట్రంలో జరిగిన మొత్తం సమావేశాల్లో 327 అంశాలపైన చర్చలు జరిగాయి. దాంట్లో 321 అంశాలకు రాష్ట్ర కాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశాల అమలు పురోగతిని శాఖల వారీగా మంత్రి వర్గం అధికారులతో చర్చించింది.
రాష్ట్రంలో కోత్తగా 22 వేల ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే 60 వేల ఉద్యోగాలను భర్తి చేసింది. వీటితో పాటు రాష్ట్రంలో మరో 17084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉంది. ఇంకా కొత్తగా 22033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.