మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం. మనిషి శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యంగా జీవించాలనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలని ఇతరులకు సలహా ఇవ్వాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. హార్ట్ రేట్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్య సూత్రాలలో మొదటగా జీవక్రియ రేటును మెరుపరచుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
మనిషి ఉండకూడనివి అనారోగ్యానికి దారి తీసేవి శారికంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ ,ఆర్థికంగా స్వల్పంగా మార్పులను జీవనశైలిలో గమనిస్తే దాన్ని వ్యాధి లేదా అనారోగ్యం అని అంటారు.
కొన్ని అనారోగ్య రోగాలు
మధుమేహం: దాని చిట్కాలు
మామిడాకులు రాత్రిపూట నీటిలోకాచి ఉదయం వడకట్టి తాగాలి. ద్రాక్ష పండ్లు రోజుకు రెండు లేదా మూడు తినాలి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
ఆస్తమా: అస్తమా అదుపులో ఉండాలంటే దాల్చిన చెక్క పొడిచేసి ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. దీనివల్ల ఆస్తమా నియంత్రణలో ఉంటుంది.
అధిక రక్తపోటు: రక్తపోటు నివారణకు ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ అల్లా రసం ఒక స్పూన్ వెల్లుల్లి రసం కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి. దీనివల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
మూత్రపిండంలో రాళ్లు: ఈ మధ్య కాలంలో మూత్రపిండంలో రాళ్లు పేరుకుపోవడం తరచూ చూస్తుంటాం. దానికి నివారణగా ఉలవచారు దానిమ్మ గింజలను కలిపి తీసుకోవాలి. తులసి ఆకుల రసం తేనె కలిపి తీసుకోవాలి. పుచ్చకాయ తిన్నడం వాల్ల మూత్రపిండాల్లో రాళ్లు పోతాయి. లివర్ పని తీరును మెరుగుపరుచుకోవడానికి వేడి నీటిలో తులసి ఆకులను కడిగి తీసుకోవాలి. అది జీర్ణ క్రియకు కడుపునొప్పి నివారణకు మలేరియా మరియు తలనొప్పులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
బొప్పాయి: ఇది జీర్ణ క్రియకు మలబద్దాని నివారించడానికి మరియు బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవాలనుకునేవారువీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పుచ్చకాయ: పుచ్చకాయ శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చూస్తుంది. చర్మాన్ని రక్షిస్తుంది. బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. ఇవి వేసవిలో ఎక్కువ తీసుకోవడం వల్ల ఎండ దెబ్బ నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. నీరసం నిస్పృహ లాంటివి తగ్గుతాయి.
ఆపిల్ పండు: ఆపిల్ పండు ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ కొవ్వు నిలువను తగ్గించి ఆకలిని నియంత్రించి బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
జామ పండు: జామ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే గుండె సమస్యలకు కూడా మంచిగా పనిచేస్తుంది. డయాబెటిక్ వాళ్లకి మంచి ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఇది అన్ని మార్కెట్లో దొరికే ఒక పేదవాడి ఆపిల్ గా పేర్కొనబడిన పండు జామపండు.
స్ట్రాబెర్రీ మరియు బ్లాక్బెర్రీలు: వీటిలో ఫైబర్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
పైనాపిల్ :పైనాపిల్ రోగ నిరోధక వ్యవస్థను బలపరిచే మంచి ఫ్రూట్. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఆరేంజ్ పండు: దీనిలో విటమిన్ -C అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తుంది. దీనిలో ఎకువగా పోషకాలు,విటమిన్స్ ఉంటాయి.
దానిమ్మ: దానిమ్మ ఇది శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. యంటిఆక్సిడెంట్లు, యంటి ఇంప్లమేటారి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది రక్త వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
కర్బుజా పండు: ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. గుండే సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అరటిపండు: తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. గుండెకు మేలు చేస్తుంది. దీంట్లో పొటాషియం మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఎన్నో ప్రయోజనాలు ఉన్న పండ్లు ఎంతో మంచి పోషకలను అందిస్తాయి. పండ్లు శరీరనికి అవసరమైన పోషకలను అందిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు రక్తప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యను కూడా పరిష్కరిస్తాయి. మనిషి ఉదయం లేవగానే రోజు ఒక పండు తినడం వల్ల శరీరానికి తగిన శక్తి అందించడంతోపాటు రోజు మొత్తం ఆక్టివ్ గా ఉండడానికి సహాయపడుతుంది.
పండ్లు ఎంతో ప్రాముఖ్యతమైనవి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పండ్లను ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరానికి తగిన వాటర్ తో పాటు శక్తిని అందిస్తాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ మరియు నూనెలు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు మరియు అనేక వ్యాదులు వ్యాపించడంతో పాటు అనారోగ్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరోగ్యకరమైన వ్యక్తికి కావలసిన కొన్ని విటమిన్స్ పోషకాలు.
రోగ లక్షణం కావలసిన విటమిన్లు.
విటమిన్స్ పట్టిక
అలసట: తీవ్రమైన అలసట ఉన్నవారు విటమిన్ బి12 ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
రోగ నిరోధక శక్తి తగ్గడం: రోగనిరోధక శక్తి తగ్గడం ఇలా ఉన్నవారు విటమిన్ సి ఎక్కువ ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవడం ముఖ్యం.
జుట్టు ఉడిపోవడం: జుట్టు ఎక్కువగా ఊడిపోయే వాళ్ళు బయోటిన్ అనే విటమిన్ B7 తీసుకోవడం వల్ల జుట్టు ఉడకుండా ఉంటుంది.
తరచూ జలుబు రావడం: బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల తరచుగా కొందరులో జలుబు రావడం జరుగుతుంది. దీనికి ఎక్కువగా విటమిన్ -డి ఉండే పోషకాలు తీసుకోవడం మంచిది.
పాదాలు చేతులు కాళ్లు పట్టేయడం: చాలామందిలో ఎక్కువగా పాదాలు చేతులు పట్టేయడం జరుగుతుంది. ఇలా ఉన్నవాళ్లు మెగ్నీషియం విటమిన్-డి ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య దరిచేరదు.
రాత్రిలు చూపు తగ్గడం: ఎక్కువమందిలో చూపు తగ్గడం దూర చూపులు చూడలేకపోవడం అటి కంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా విటమిన్-ఎ ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల కంటి సమస్య తీరుతుంది.
గాయాలు నెమ్మదిగా మానడం: చాలామందిలో కొందరి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉండడం వల్ల గాయాలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి వారు విటమిన్ -సి మరియు విటమిన్ – జింకు ఉన్న పోషకాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మానసిక ఆలజడి మరియు మానసిక ఒత్తిడి: ఇలాంటి సమస్య ఉన్నవారు ఎక్కువ ఆందోళన గురి కావడం. మానసికంగా కృంగిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి వాళ్ళు విటమిన్ -బి6 మరియు మెగ్నీషియం ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల సమస్యను పరిష్కరించుకోగలుగుతారు.
ఒంటి నొప్పులు: ఒంటినొప్పులు దీర్ఘకాలంగా ఉన్నప్పుడు విటమిన్ -డి మరియు విటమిన్స్ -కే2 అనే విటమిన్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
చర్మ రోగాలు: ఈ చర్మ సమస్యల వల్ల చర్మం పోరిబరడం మరియు దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. చర్మ రోగాలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఐరన్ మరియు విటమిన్ -బి12 వంటి పోషకాలు ఉన్న విటమిన్స్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలను దరి చేరాకుండా చూసుకోగలరు.
గోర్లు విరగడం: గోర్లు విరగడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఇలాంటి వారు బయోటిక్ మరియు ఐరన్ ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను పరిష్కరించుకోవచు.
జ్ఞాపక శక్తి తగ్గడం: మబ్బు ఇలాంటివారు ఒమేగా-3 మరియు బి-కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల జ్ఞ్యాపశక్తి మెరుగుపరచుకునే అవకాశాలుంటాయి.
మలబద్ధకం: మలబద్ధకం సమస్యగా ఉన్నవాళ్లు మెగ్నీషియం మరియు ఫైబర్ మరియు విటమిన్స్ ఎక్కువ ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల మలబద్దకు సమస్యను పరిష్కరించుకోవచు.
చేతులు మరియు కళ్ళలోనొప్పులు: చేతిలో మరియు కళ్ళలో నొప్పులు ఉన్నవారు ఎక్కువగా విటమిన్ బి1 మరియు బి12 పోషకాలు ఉన్న విటమిన్స్ తీసుకోవడం వల్ల చేతులు మరియు కళ్ళలో నొప్పులు తగ్గుతాయి.
నోటిపూత రావడం: తరచుగా నోటిపూత రావడం చూస్తుంటాం. ఇలాంటి సమస్య ఉన్నవారు విటమిన్స్ బి12 బి౩ బి2 వంటి విటమిన్స్ తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
ఎముకలు బలహీనత: ఎముకలు బలహీనత ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ కాల్షియం మరియు విటమిన్ డి3 మరియు k2 ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతలు పరిష్కరించుకోవచ్చు.
స్త్రీలలో హార్మోనల్ సమస్యలు: ఇలాంటి సమస్యకు విటమిన్ -B6 విటమిన్ -E విటమిన్ -D వంటి విటమిన్స్ తీసుకోవడం వల్ల స్త్రీలలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు. విటమిన్ లో పని నిర్ధారించుకోవడానికి డాక్టర్ సల తీసుకోవడం ఉత్తమం.