130వ రాజ్యాంగ సవరణ ప్రాంతీయ పార్టీలకు ప్రమాదం….కేంద్ర ప్రభుత్వం కొత్త సవరణ?
దేశంలో జైలు శిక్ష పడిన ముఖ్యమంత్రి,మంత్రులు, ప్రధాన మంత్రి పదవి నుండి తొలగించాలనే అంశానికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం తీసుకున్న ఆ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇలా వ్యతిరేకత వ్యక్తం అవ్వడానికి గల కారణం ఏమిటంటే దేశంలో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి అధికార పార్టీ కేసులు పెడుతుందని అధికార పార్టీ పెట్టిన కేసులు, ఈడిలు, సిబిఐలు కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్లు మాత్రమే శిక్షలు అనుభవిస్తున్నారు.

ముఖ్య ఉద్దేశం
ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సిన బిల్లు ఎవరైతే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి ఉంటారో వాళ్లు 30 రోజులు మించి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ మంత్రి పదవి పోతుంది. అలా పోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే 30 రోజులు జైల్లో ఉండాల్సి వస్తే పదవి నుంచి తొలగించాలని కొత్తగా చేయాలనుకున్న రాజ్యాంగ సవరణ 130వ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం సవరణ చేయాలనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం జైలు నుండి ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, కేంద్ర ప్రభుత్వం చెప్పటిన 130వ సవరణ బిల్లు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం చేస్తున్న వాదన.
ప్రవేశపెట్టనున్న మూడు బిల్లులు
130వ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను తీసుకురావాలని అనుకుంటుంది. జమ్ము-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సంబంధించి, రెండు కేంద్రపాలిత ప్రాంతాల సంబంధించి, అలాగే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి 30 రోజుల తర్వాత కూడా జైల్లో ఏదైనా కేసులో ఉండాల్సిన పరిస్థితి వస్తే పదవి నుంచి తొలగించాలని బిల్లును తీసుకురావాలనే ఆలోచనలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ మూడిటి అంశాల పైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ మూడు కూడా ప్రజాస్వామ్య పాలిట ప్రమాదకరమైనవిగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ వస్తున్నాయి.
కారణం ఏంటి అంటే కక్ష గట్టి ఎవరిపైనైనా కేసు పెడితే 30 రోజులు జైల్లో ఉంచితే వాళ్లు వారి పదవుల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించే ప్రమాదం ఉందని ఇది ప్రధానంగా దేశంలో ఉన్న రీజినల్ పార్టీలను లేకుండా చేసే కుట్రలో భాగంగా జరుగుతుందని ప్రాంతీయ పార్టీలను సమూలంగా లేకుండా చేయాలని కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టి వారి పదవులను పార్టీలను కాన్కర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనుకుంటుందని దేశంలో ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. తృణములు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.ఇటు తెలంగాణ లోను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అనేక ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఇలా వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ కూడా వచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జేపీసీ వేసింది. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సంబంధించి అపరాధిత తరంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో జెపిసి వేశారు.

జేపీసీ వేసిన సందర్భంగా దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీకి స్థానం కల్పిస్తూ నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు అలాగే సుప్రియ సూరి సంబంధించిన ఎంపీ కూడా స్థానం కల్పించారు. రీజినల్ పార్టీలు వ్యతిరేకిస్తూ వస్తున్నప్పటికీ వ కి సంబందించిన సభ్యులు కూడా జేపీసీ కమిటీలో ఉండడం ఆశ్చర్యను గురిచేస్తుంది. ఇలా 31 సభ్యులతో జేపీసీ కమిటీ వేశారు. ఈ జేపీసీని వ్యతిరేకిస్తున్న పార్టీలు పోరాటం చేస్తాయని చెప్తున్నారు.
ఇది ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదు అని చెప్తున్నారు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో జరిగిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. కొన్ని నెలలపాటు ఆయన జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఈ కొత్త చట్టం కనుక అమలు అయితే ఇది రాజ్యంగా సవరణ జరిగితే అలా ఉండడానికి వీలు ఉండదు. ఎవరైనా భారత రాజ్యాంగం ప్రకారం జైల్లో ఖైదీగా ఉన్న సమయంలో కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావచ్చు. ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రధానమంత్రిగా కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జైలుకు వచ్చినా కూడా పదవికి రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు దాని తీసివేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కోర్టులు శిక్ష వేసేవరకు కోర్టుదోసి అని తేల్చే వరకు అతనికి అన్ని రకాల హక్కులు ఉంటాయని, తను నిర్దోషిత్వాన్ని కోర్టు ముందు చెప్పుకోవడం. అలాంటిది ఏదో కేసులో 30 రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన ఆ కేసులో అతను దోషోకాదో తేలకుండానే అతని పదవి నుంచి తొలగించడం ఏ రకంగా సరైనదాని అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కేజ్రివాల్ కేసు
కేజ్రివాల్ కు సంబంధించిన కేసు తీసుకుంటే 30 రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి కొత్త చట్టం కనుక అమలు అయ్యి ఉంటే అత్యవసరంగా ఆయన ముఖ్యమంత్రి పదవి పోయేది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరు నిందితులనే అంశం సంబంధించి తేలిందా అంటే ఇప్పుడు వరకు తేలలేదు. ఎప్పుడు తేలుతుందో తెలియదు. కానీ ఈ కొత్త చట్టం అమలు అయితే దోషి ఎవరో నిర్ధారణ కాకముందే పదవిని కోల్పోవాల్సి వస్తుంది.
గతంలో రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా రాజ్యాంగం రకరకాల ప్రజల ఉద్యమాల పేరుతో, ప్రజల సంబంధించినటువంటి కార్యక్రమాలతో జైలుకు పోయినటువంటి సందర్భం ఉంది. స్వతంత్ర ఉద్యమంలో అనేక మంది జైలుకు వెళ్లారు.జైలు నుంచి పోరాటం చేశారు. అదే స్ఫూర్తితో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన జైలు నుంచి పోటీ చేయొచ్చు. జైలు నుంచి కూడా నామినేషన్ వేయొచ్చు, గెలవచ్చు అని రాజ్యాంగంలో చెప్పింది. అలా జైల్లో ఉండి కూడా గెలిచిన సందర్భాలు చాలా చూశాం.
అటువంటి ప్రజాస్వామిక హక్కుని ప్రజాస్వామ్యాన్ని హరించేప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో ముందుకే వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సవరణ చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సవరణ చేసే క్రమంలో ప్రాంతీయ పార్టీల గొడ్డలిపెట్టుగా ఉన్న ఈ సవరణను వ్యతిరేకిస్తూ వస్తున్న ప్రాంతీయ పార్టీలు దీంట్లో స్థానం కల్పించింది.
ఎన్డీఏలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా స్థానం కల్పించారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఎన్సీపీకి స్థానం కల్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా జేపీసీలో నెంబర్ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. జేపీసీలో వచ్చిన అభ్యంతరాలను, జేపీసీలో వచ్చిన సవరణలు, సూచనలను పరిణలోకి తీసుకుంటారా లేదా, ఏ రకమైన సూచనలను జేపీసీలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తాంుంది అని చెప్తున్నా రాగ్యంగా సవరణని వ్యతిరేకిస్తూ పార్టీలు తిరస్కరించడం చూడాల్సి ఉంది. ఇది ఒక్క దేశంలో కీలకమైన మార్పుగా, కీలకమైన సవరణగా 130వ రాజ్యాంగ సవరణలను చూడాల్సిన అవసరం ఉంది.