ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరుబాట ధర్నా
తెలంగాణ రాష్ట్రంలో ఎరుపడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు సామజిక న్యాయం చేయాలనే సంకల్పం తో రాష్ట్రంలో కులగణన చేపట్టింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల ప్రజలకు అందాలనే లక్ష్యంగా దేశంలోనే మొదటి సరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామజిక, ఆర్ధిక, కుల సర్వేను నిర్వహించింది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయలేకపోవడంతో రెండవ విడతలో వారికీ అవకాశం కల్పించారు.
మొదటి సర్వే
మొదటి దశ 2024 నవంబర్ 6వ తేది నుంచి డిసెంబర్ 25వ తేది వరకు 50 రోజుల పాటు రాష్ట్ర మంతట రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు చెందినా సమాచారం సేకరించేదుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్ గా ఎంచుకుంది. ఒక్కో బ్లాక్ కు ఒక ఎన్యుమరేటర్ ను, నియమించింది. ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,౦౩,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించింది. మొదటి విడుతలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి అయాకుటుంబాల వివరాలను 36 రోజులలో డేటాను ప్రత్యేకంగా చేయించింది.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి ౩,55,50,759 మంది ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కుల గణన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42%) ,ఎస్టీలు 37,08,408 మంది (10.43%), బీసీలు 2,౦౦,.37,668 మంది (56.36%), ఇతర కులలాకు చెందిన వారు 56,1౩,౩89 మంది (15.89%) మంది ఉన్నట్లు తేలింది. ఈ సర్వే వివరాల నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది.
స్వాతంత్ర నిపుణుల వర్కింగ్ కమిటి
సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రుపొందించేదుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్ట్ జడ్జి సుదర్శన్ రెడ్డి గారి అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వాతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూపును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సర్వే ఫలితలను విశ్లేషించి వివరణత్మక నివేదిక అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటికి అప్పగించింది. ఈ కమిటి వివిధ దఫాలుగా సమావేశాలు జరిపి డేటాను సేకరించిన పద్దతి శాస్త్రీయంగా నిశితంగా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరచేందుకు,సామజిక న్యాయం, సామజిక సాధికారత, వెనుకబడిన బలహీన వర్గాల అభ్యున్నతిని మెరుగు పరచేందుకు సర్వే సహాయపడుతుందని కమిటి సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగానణను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటి ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామజిక, ఆర్ధిక, విద్య,ఉద్యోగ ,రాజకీయ ,కుల సర్వే – 2024 (SEEEPCS) పూర్తి శాస్త్రీయంగా, విశ్వసనియంగా ఉందని మిపునుల కమిటి తన నివేదిక అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఈ సర్వే చరిత్రాత్మకమని, దేశానికి రోల్ మాడల్ గ నిలుస్తుందని కమిటి అభిప్రాయం వ్యక్తం చేసింది.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధికి సంస్థ (ఎంసీహెచ్ఆర్డి) లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటి సభ్యులు ౩౦౦ పేజీల నివేదిక సమర్పించారు. నిపుణుల కమిటి సమర్పించిన నిదేశికలో అంశాలు, సూచనలను మత్రిమండలి సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో బాలహిన వర్గాల అభ్యున్నాతికి, సామజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పట్టాణ,గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, అందుకు కారణాలపై నిపుణుల కమిటి అధ్యయనం చేయాలని కోరారు. అర్వులైన అందరికి సంక్షేమ పథకాలు అందిచేల చర్యలు తీసుకుంటామని, ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటిని కోరారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, సలహాదారు నరేందర్ రెడ్డి గారు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు గారితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో పాటు, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచే అయిలయ్య గారు, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్వా గారు, ప్రొఫెసర్ హిమాన్షు గారు, డా.సుఖదేవ్ తోరాట్ గారు, నిఖిల్ డే గారు, ప్రొఫెసర్ భంగ్య భుక్య గారు, ప్రొఫెసర్ పుర్శోతం రెడ్డి గారు, ప్రొఫెసర్ జీన్ డ్రెజ్ గారు, ప్రొఫెసర్ థామస్ పికేట్టి గారు, ప్రవీణ్ చక్రవర్తి గారు, సెక్రటరీ అనుదిప్ దురిశెట్టి గారు పాల్గొన్నారు.
రాష్ట్రాపతి గారికి విజ్ఞప్తి
సామజిక న్యాయం అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామజిక,ఆర్ధిక,కుల సర్వేను నిర్వహించింది. ఇది ఇలా ఉండగా స్థానిక సంస్థలు అలాగే విద్య,ఉద్యోగాల కల్పనలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్ట బద్దత కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి గౌరవ రాష్ట్రాపతి గారిని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి శ్రీ.రేవత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులను ఆగష్టు 5,6,7 తేదిలలో ఢిల్లీకి వెళ్ళాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబెద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం స్థానిక సంస్థల ఎన్నికాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సుదిర్ఘంగా చర్చించింది.
హైకోర్ట్ గడువు
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్ట్ విధించిన గడువు సమిపిస్తుండగా, ప్రస్తుతం బీసీ బిల్లు రాష్ట్రపతి గారి వద్ద పెండింగ్ లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ఈ నెల 5,6,7 తేదిలలో నిర్వహించిన ధర్నా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విజ్ఞప్తి చేయడానికి వీలుగా గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారి అపాయింట్మెంట్ కోరాలని నిర్నహించారు. రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ఈ విషయంలో అన్ని పార్టీలు సహకరించాలని మంత్రి మండలి కోరింది.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరుబాట ధర్నా
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లులను అమోదించాలన్న అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పార్లమెంట్ లో ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యలు పాల్గొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మద్దతును ప్రకటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన పోరుబాట కార్యక్రమంలో ముఖ్జ్యమంత్రి గారు మాట్లాడుతూ, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శాసనసభలో విద్య,ఉద్యోగ,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా,రోల్ మాడల్

బీసిలకు శుభవార్త
రాబోవు రోజుల్లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణన కులగణన తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శంగా,రోల్ మాడల్ గ నిలుస్తుందని అన్నారు. ఫిబ్రవరి 4, 2024 రోజున ప్రారంభించి సరిగ్గా ఏడాది కాలంలో 4 ఫిబ్రవరి 2025 నాటికీ సర్వే పూర్తి చేసి రిజర్వేషన్లు కల్పిస్తూ పరిష్కార మార్గం చూపించాం. రిజర్వేషన్లును సాధించడానికి సడక్ నుంచి సంసద్ వరకు వచ్చాం. యావత్ దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది. వందేళ్ళలో ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రాలను పాలించిన దాదాపు మూడు వందల మంది ముఖ్యమంత్రులు ఎవరు చేయలేని సాహసం తెలంగాణ మంత్రిమండలి విజయవంతంగా పూర్తి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన బీసీ రిజర్వేషన్లకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు మద్దతుగా నిలిచారు. జంతర్ మంతర్ ధర్నాతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా డిమాండ్ ను ఆమోదించాలి. ఈ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలను తెలంగాణ గ్రామ గ్రామాన చేయవేయలని చెప్పారు. ఒక గొప్ప లక్ష్యంతో ఢిల్లీ వేదికగా పోరాటం సాగిస్తున్నాం. రాష్ట్రపతి గారు మా బిల్లులను వెంటనే ఆమోదించండి… అని విజ్ఞప్తి చేశారు.
పార్టీల మద్దతు
ఈ ధర్న కార్యక్రమంలో డీఎంకే, సమాజ్ వాది, ఎన్సిపి, శివసేన, సిపిఎం తదితర పర్తలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొని తెలంగాణ సంకల్పించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతును ప్రకటించారు. ఈ ధర్నాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు,ఎమ్మెల్సిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.