
రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాకు సంకల్పం ఉంది. దానికి అనుగుణంగా విజన్ ఉంది. రాష్ట్రనికి అధిక ఆర్ధిక భారం ఉన్నపటికీ శూన్యం నుంచి మొదలు పెట్టి ఉన్నత శికరాలకు రాష్ట్రని తిసుకేల్లడానికి కృషి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల అండా దండలతో లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించం అని “గోల్కొండ వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపన్యసించారు.
ఈ సందర్బంగా ఆగష్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక పునస్కరించుకొని గోల్కొండ రాణిమహల్ లాన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, సమ్మాన్ గార్డ్స్ కవాతు అనతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ సమగ్రా అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళిక ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం పని చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

తెలంగాణా రాష్ట్రం లో అధికారం చేపట్టిన వెంటనే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఉద్యమకారులు,మరవీరుల ఆకాంక్షలు,ఆశయాలకు అనుగునగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు,మహిళలు,యువత భవితకు పెద్దపిట వేశాం. సామజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. రహ్స్త్రం నిర్వహించిన కుల గణనతో బలహీన వర్గాల వందేళ్ళ కళను నిజం చేశాం. రాష్ట్రం లో అభివృధి, సక్షేమం అనే రెండు విధానాలతో ప్రభుత్వం పాలనా కొనసాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎరుపడిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని కలుపుకుని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృధి విధానాన్ని ప్రజా ప్రభుత్వం ఎంచుకుంది. రాష్ట్ర అభివృద్దిలో ఆధునికత పరిపాలనలో పారదర్శకత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ 20 నెలల కాలంలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా నిలబెట్టాం.
తెలంగాణ రాష్ట్ర బకాయిలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికీ 8,21,651 కోట్ల అప్పులు, బకాయిలు ఉండగా అందులో 6,71,757 కోట్ల అప్పు ఉంది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్, ఇతర విభాగాలకు చెందిచాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు ఉండగా, వాటిపై అసలు రుపేణా1,32,498 కోట్లు,వడ్డీ రూపేణా 88,178 కోట్లు మొత్తం కలిపి 2,20,676 కోట్ల రూపాయల డేట్ సర్విసింగ్ చేసాం.
రాష్ట్రంలో ప్రతి పేద కుటుంభం సన్న బియ్యం తినాలనే సంకల్పంతో పేద ప్రజల ఆహార భద్రతకు భరోసాగా ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణి ప్రారంభించాం. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మదికి సన్నబియ్యం పంపిణి చేపట్టాం. నిరుపేదల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే పతకంతో పేదల కళ్ళలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కాలంగా నిలిచిపోయిన రేషన్ కార్డులు ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణి ప్రారంభించాం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలెక్షన్ ముందు ఇచ్చిన హామీలలో బాగంగా వరంగల్ వేదీకగా 2022 మే 6 న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల ఋణామాఫీ చేసి సారి కొత్త చరిత్ర సరుసతినచాం. రైతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడేప్రసక్తే లేదు. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. రైతు బారోసా కింద ఎకరాకు రూ. 12 వేల చొప్పున జూన్ 16 న కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల పెట్టుబడి సహాయం కింద అందించాం. దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా తెలంగాణ రైతాంగాన్ని ప్రోత్సహించాం.
రాష్ట్ర వ్యాప్తంగా 7,178 కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్రంలో పండించినటు వంటి ప్రతి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేశాం. సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల పంపుసెట్లకు 16,691 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇవన్నీ రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ప్రజా ప్రభుత్వం ఎరుపడిన తరువాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి రూ. 1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేదల సొంతింటి కళను నెరవేర్చడానికి తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 22,500 కోట్లను వెచ్చిస్తునాము. ప్రతి పెదింటి కళను నెరవేరచాలనే సంకల్పంతో లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటహిస్తున్నాం. దేశంలోనే ఎవరు చేయలేని సామాజిక తెలంగాణ సాధన కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టాం. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ ద్వారా ఆమోదించాం. ఆ బిల్లులను కేంద్ర ప్రభుత్వం సత్వరం ఆమోదించాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మా చిత్తశుద్దిని నిరూపించుకున్నాం. సామాజిక తెలంగాణకు పునాది వేసిన రోజు ఫిబ్రవరి 4 వ తేదీన తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని నిర్ణహించాం.
రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కోటి మంది మహిళను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో అనేక కార్యకర్తమాలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం భాద్యత చేపట్టిన నాటి నుంచి అత్యంత పరాదర్శకతతొ, వివాదహితంగా వివిద పరీక్షలు నిర్వహించి 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలను కల్పించాం. రాష్ట్రంలో యువత తప్పు దారిన పడకుండా మాదక ద్రవ్యాల భరిణ పడి వారి జీవితాలను నాశనం చేసుకోకుండా వాటికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే ప్రాణాళికలతో ప్రాజెక్టులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్తున్నాం.
నీటి వాటా విషయంలో కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావలసిన వాటాల సాదనలో రాజీ పాడం అని మరో సారి స్పష్టం చేశారు. హైదరబాద్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలకు హైడ్రాను ఏర్పాటు చేసిన తరువాత 13 పార్కులను, 20 చెరువులను ఆక్రమణల నుంచి రక్షించింది. 30 వేల కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ భూములను కాపాడగలిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనది హైదరాబాద్. ఇది రాష్ట్రానికి ఎంతో బాలన్ని ఇస్తుంది. హైదరాబాద్ బాలన్ని మరింత బ్రాండింగ్ చేయడానికి పలు అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించాం. మిస్ వరల్డ్, వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెంట్స్ సదస్సు, గ్లోబల్ రైస్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు వంటివి నిర్వహించాం. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చుకుంటున్నాం.
తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్
శాంతి భద్రతలు రాష్ట్ర ప్రగతికి కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతుందంటే అందుకు మన పోలీస్ వ్యవస్థ కారణం. వారికి అభినందననలు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ది బెస్ట్ అనే పేరుంది. అన్నీ వేదికల నుంచి తెలంగాణ విజన్ ను ప్రపంచానికి పరిచయం చేశాం. తెలంగాణ రైజింగ్ 2047 (telangana rising 2047 ) విజన్ డాక్యుమెంట్ ను ఈ ఏడాది డిసెంబర్ లో ఆవిష్కరించబోతున్నాం. దేశ స్వాతంత్ర్యం సిద్దించి శత వసంతాలు పూర్తి చేసుకుటున్న 2047 నాటికి తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబెట్టాలన్న విజన్ తో నిరంతరం శ్రామిస్తున్నాం.
పలు అభివృద్ది పనులు
భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సలకల్పం. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ గ్రామీణ వ్యవసాయ వికాసం వరకు విజన్ లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించాం . రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టు, మెట్రో విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డును కలిపే రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కరీడార్ల ఏర్పాటు వంటి లక్ష్యాలతో తెలంగాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ప్రాణాళికే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్.