లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా

LIC కి భారి లాభాలు…. కానీ కేంద్రం?

LIC కి భారి లాభాలు.... కానీ కేంద్రం?
LIC

 

LIC కి భారి లాభాలు…. కానీ కేంద్రం?

LIC అంటే  (లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా), ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి. ఇది జీవిత భీమ సంస్థ. LIC భారతదేశంలోనే అతి పెద్ద కంపెనీ. ఇది ఆర్ధిక పెట్టుబడుల సంస్థ.1956 వరకు దేశంలో 245 ప్రైవేట్ ఇన్సురెన్స్ కంపెనీలు ఉండేవి. అన్ని ఇన్సూరెన్స్ కంపనిలను కలిపి 1956 లో LIC గా మార్చారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా సెప్టెంబర్ 1, 1956 లో భీమ సంస్థని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈ సంస్థ ఎలా పని చేస్తుంది అంటే ఇది భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పని చేస్తుంది.

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా యొక్క ప్రధాన నినాదం “మీ సంక్షేమం మా బాధ్యత”. LIC జీవిత భీమ అవసరాలను తీర్చడానికి అన్ని రకాల పాలసిలను అందిస్తుంది. దీనిలో జీవిత భీమతో పాటు పొదుపు మరియు పెన్షన్ వంటి ప్లాన్ లు ఉన్నాయి. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా భారతదేశంలో ఎక్కువ శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది దేశంలో అనేక శాఖలు కలిగి ఉంది. మన దేశంలో ఉండే 91% జిల్లాలలో శాఖలు ఉన్నాయి. అంతర్జాతియంగా కూడా LIC శాఖలు సింగపూర్,నేపాల్, శ్రీలంక,బంగ్లాదేశ్, యుకె వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

LIC యొక్క బ్రాండ్ వాల్యు

LIC కి 1956 నుండి 2000 వరకు ఎటువంటి కంపిటిటర్ లేరు. LIC యొక్క బ్రాండ్ వాల్యు 2021 నాటికీ US $8,655 డాలర్స్ గా ఉంది. ఈ బ్రాండ్ స్త్రెంత్ ఇండెక్స్ (BSI) యొక్క ఇండెక్స్ స్కోర్ 84.1 అవుట్ అఫ్ 100. ఇది 3వ అతిపెద్ద బలమైన 10వ (MOST VALUABLE GLOBAL INSURANCE BRAND). LIC మన దేశంలో మార్కెట్ షేర్ ఎక్కువ, మొత్తం ప్రీమియంలో 64.1% LIC  కడుతున్నారు. కోత్తగా పాలసీ తీసుకునేవారు 66.2% LIC నే ఎంచుకుంటున్నారు. మిగతా 33.8% కంపెనీలు (SBI,HDFC,ICICI among others.) వంటివి ప్రీమియంలు మాత్రమే ఎంచుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం LIC కి రెన్యువల్ చేసుకునే వారి సంఖ్య 62.5% గా ఉంది. అలాగే మిగతా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపనిల రెన్యువల్ 37.5% గా ఉంది. భారతదేశంలో LIC ఏజెంట్ నెట్వర్క్ 1.35 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. మిగతా కంపనిల మొత్తం ఏజెంట్స్ కలిపి 1.10 మిలియన్స్ ఉన్నారు. ఇలా దేశంలో ఉన్న అన్నిఇన్సూరెన్స్ కంపనీలలో LIC కి మాత్రమే ఎక్కువ ఏజెంట్స్ ను కలిగి ఉంది. ప్రపంచంలో చూసుకుంటే LIC 5వ స్థానంలో ఉంది.

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసిలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇలాంటి ఒక్క గొప్ప సంస్థని కేంద్ర ప్రభుత్వం ప్రైవెటికరించాలని చూస్తుంది. అలాగే దేశంలో ఉండే అనేక ప్రభుత్వ ఆస్తులను  ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  బ్యాంకులు జాతీయకారణగా ఉండటానికి కారణం స్వాతంత్ర్యం తరువాత తీసుకున్న అద్భుతమైన నిర్ణయం.  అంతే కాదు, భారతదేశంలోని ప్రముఖలు, ఆర్థికవేత్తలు కూడా దీనిని ప్రశంసిస్తున్నారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ

అటువంటి నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న ప్రైవేటీకారం చేసిన బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  ఇది కేవలం బాహ్య నిర్ణయం కాదు. ఇది ఆర్థిక మంత్రి వ్యక్తం చేసిన నిర్ణయం. 1990ల నుండి కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోంది. వ్యాపారం చేయడానికి ప్రభుత్వం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  సమన్వయం చేసుకోవడానికి, సేవలను అందించడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది.

వ్యాపారం చేయడానికి ప్రభుత్వం లేదని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుకొని అవి లాభాల్లో ఉన్నాయా, నష్టాల్లో ఉన్నాయా, వాటి నష్టాలు కూడా భరిస్తూ ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తాయి.  ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడానికి లేవని మోడీ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెపింది. ఇప్పుడు ఉన్న సందర్భం ఏంటి అంటే విశాఖ స్టిల్ లాంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ అధ్వర్యలో ఉన్న సంస్థలు నష్టాలు వస్తున్నాయి అనే పేరుతో అమ్మేస్తూ వచ్చారు. మరి కొన్ని సంస్థలను నష్టాలలోకి తీసుకెళ్ళి కూడా అమ్మేస్తూ వచ్చారు. ఇలా అమ్మే క్రమంలో తమ అనుకునే వాళ్ళకు ఆ సంస్థలను కట్టబెట్టుకుంటూ వచ్చారు. ఈ నేపద్యంలోనే కేంద్ర ప్రభుత్వం అధ్వర్యలో ఉన్న సంస్థలు అన్నిటిని ప్రైవేటు సంస్థలకి అప్పగించాలని చూస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకు దరదత్తం చేస్తుందానే విమర్శలు ఎదురుకుంటుంది. ఇలాంటి విమర్శలు LIC విషయంలోను కూడా వచ్చాయి.

LIC  ప్రైవేటీకరణ

ఈ దేశంలో ప్రజలు మారుమూల ప్రాతాల నుండి కూడ బలంగా నమ్మేది LIC. LIC అంటే భద్రతకి భరోసగా భావిస్తుంటాం. అలాంటి LIC కి సంబందిచిన ఆస్తులు ఆధానికి కట్టబెట్టాలని ప్రయత్నం చేశారు. ఆధానికి సంబంధిన సెక్యూరిటీ డిపాజిట్ గా LIC ఆస్తులు పెట్టినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు LIC మిద కూడా కేంద్ర ప్రభుత్వ కన్ను పడింది. LIC లో కొంత పర్సెంటేజ్ ప్రైవేటికారణం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు LICని  పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు అని వాళ్ళకి అమ్మేసే ప్రయత్నంలోనే ఉందన్ని అనేక రోజుల నుండి అనేక వార్తలు చూస్తున్నాం. అనేక ప్రభుత్వ సంస్థలు పోర్టులు,రైల్వే పైన కేంద్రం కన్ను పడిందని అన్నిటిని ప్రైవేటీకరం చేస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కూడా ఇలాంటి వాటిని ఎక్కడ ఖండించలేదు. ఇటువంటి నేపద్యంలో దేశ ప్రజలు శాంతం కలిగించే వార్త, LIC ప్రభుత్వంలోనే ఉండాలనే కోరుకునే వాళ్ళకు భాదాకరం కలిగించే వార్త, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వార్త ఒకటి ఉంది.

LIC రెండవ త్రైమాసికంలో భారీగా లాభాలు పెరిగాయి. రెండవ త్రైమాసికంలో LIC లాభాలు 10% పెరిగాయి, రెండవ త్రైమాసికంలో Rs.10,005 కోట్లు మరియు Rs.10,001 కోట్లు సంపాదించాయి.  57.23 లక్షల కోట్ల మేర LIC ఆస్తులు పెరిగాయి. రెండో త్రైమాసికంలో LIC లాభాలు పెరిగాయి. LIC యొక్క లాభాలు నిరంతరాయంగా ఉంటాయి మరియు నష్టాలు ఉండవు. LIC లాభాలు 32% పెరిగాయి. LIC లాభాలు పెరుగుతున్నాయి. LIC ఆస్తులు పెరుగుతున్నాయి.  జీఎస్టీ శ్లాబులు తగ్గడంతో LIC లాభాలు పెరుగుతున్నాయి.  జీవిత భీమా పాలసీలపై జీఎస్టీని తగ్గించడంతో, ఎక్కువ మంది ఆ పాలసీలను చేయడానికి ముందుకు వస్తున్నారు.

LIC కి భారి లాభాలు

LIC ఎక్కువ చేసుకోవడం వల్ల LIC ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 6 నెలల కాలంలో LIC యొక్క ఆదాయం 10,000 కోట్లు వరకు పెరిగిందని అంచనా. ఇదే సంవత్సరంలో LIC ఆదాయం రూ.66,000 కోట్లు పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం LIC ని ప్రైవేటీకారం చేస్తున్నందున వారికీ చేదు అనుభవం మిగిలింది. LIC లాంటి ప్రభుత్వ సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ఆలోచనను విరమించుకోవాలని ప్రజలు, ప్రముఖులు,ఆర్ధిక వేత్తలు కోరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ దేశంలో ఎక్కువ మంది ప్రజలు నమ్మే సంస్థ, అంచి లాభాల్లో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న సంస్థ. ఇటువంటి సంస్థను కాపాడుకోవడం పైన ద్రుష్టి పెట్టండి అనే విమర్శలు వస్తున్నాయి.

 

Leave a Comment