తెలంగాణ లో డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలనాకై కొత్తగా ఈగల్ ఫోర్స్ టీం
గంజాయి మరియు డ్రగ్స్ అనేవి మత్తు పదార్దాలు . ఇవి ఎన్నో దేశాలలో నిషేధించబడ్డాయి. మత్తు పదార్ధాలకు బానిసలుగా మరి ఎన్నో నెరాలు,సమాజ దుర్వినియోగనికి పలుపడుతున్నారు. ఈ గంజాయి మరియు డ్రగ్స్ ప్రభావం ఆరోగ్యానికి హానికరం. ఈ డ్రగ్స్ బరీ నుండి యువతను రక్షించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సమస్య పై పోలీస్ శాఖలు కూడా డ్రగ్స్ నీయంత్రించడానికి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గంజాయి మరియు డ్రగ్స్ రహిత సమాజానికి ప్రజలు మరియు విద్యార్ధులు మత్తు పదార్దాలల వినియోగం నుండి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలలో సామాజిక అవగాహన పెంచడం, ఆక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలన కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్టం లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎరుపడిన తరువాత రాష్టంలో అనేక కఠిన నిర్ణయాలు తిసుకుంటున్నారు. 2025 జూన్ 19న రాష్ట ప్రభుత్వం eagle (“elite action group for drug law enforcement”) ను ఏర్పాటు చేసింది. యాంటీ డ్రగ్స్ డే సందర్బంగా హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినం” సందర్బంగా డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పనికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ సంకల్పనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
తెలంగాణ ఒకనాడు ఉద్యమాల ఉద్యమాల గడ్డ. తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం. తెలంగాణ లో ఇలా డ్రగ్స్ కి వేదికగా మారితే ఇది మనకే అవమాన కారం. అందుకే డిసెంబర్ 7 2023 నాడు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజూ గంజాయి మరియు డ్రగ్స్ నిర్మూలనకు కఠిన నిర్ణయాలు ఉంటాయని ఆరోజే హెచ్చరించాం.
తెలంగాణలో ఒకనాడు ఉద్యమాలకు వేడదికైనా కాలేజీలు,యూనివర్సిటీలు నేడు గంజాయి మరియు మాదక ద్రవ్యాలకు వేదికలుగా మారాయి. కాలేజీ యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మరి బలవుతున్నారు. యువతకు గంజాయి మరియు మాదక ద్రవ్యాలు గురించి పఠశాలల నుండే అవగాహన కల్పించాలి. దీనివల్ల యువత మత్తుకు బానిసలుగా మరి తమ బంగారు భవిషత్తును నాశనం చేసుకుంటున్నారు. పాఠశాల ,కాలేజీ లలో ఎక్కడైనా దినికి సంబందించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమనికి సహకరించాలి.
తల్లిదండ్రులు ఎంతో నమ్మకం తో కాలేజీలు, పాఠశాలలకు తమ పిల్లల్ని పంపిస్తుంట్టే కేవలం చదువు చెప్తే చాలు అన్నట్లుగా అధ్యాపకులు,యాజమాన్యాలు భావించడం సరికాదు. డ్రగ్స్ ని నియంత్రించడం లో వారి బాద్యత కూడా ఉంటుంది. కాలేజీలలో ఇక నుంచి మాదక ద్రవ్యాల అనవలు కనిపిస్తే అట్టి యాజమాన్యం మీద కూడా కేసులు ఉంటాయి. కాలేజీ యాజమాన్యం మరియు అద్యపకులు విద్యార్దిని,విద్యార్దుల కదలీకలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నీయంత్రణపై పాఠశాల మరియు కాలేజీల యాజమాన్యం, అధ్యపకులతో ఒక సమావేశం నిర్వహించాలి.
దేశ రాజకీయాలు
భారతదేశంలో 140 కోట్ల జనాభా లో 68శాతం యువత ఉంది. ఒకనాడు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన పంజాబ్,హర్యానా రాష్ట్రాల యువత నేడు మత్తుకు బానిసై తమ జీవితన్ని నాశనం చేస్కుంటున్నారు. దేశం అన్నీ రంగాలలో ముందుకు పోతుంటే దేశాన్ని నిర్వీర్యం చేయాడనికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. డ్రగ్స్ బారిన పడిన ఎవరైనా తెలంగాణలో అడుగుపెడితే వెన్ను విరుస్తం. ఐటి హబ్ గా, ఫార్మా హబ్ గా ఉన్న తెలంగాణను డ్రగ్స్ మరియు గంజాయి హబ్ గా మారుస్తా అంటే ఊరుకునేదేలేది. యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది. యువత సరైన దిశలో నడవలనే ఉద్ధేశ్యంతోనే క్రీడా పాలసీని తెచ్చాం . తెలంగాణ యువత తమ నైపుణ్యం మెరుగుపర్చుకోవడానికి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్ గా మార్చాలనే ఉద్ధేశ్యంతో ఆస్ట్రేలియా మరియు దక్షిణ కొరియా లాంటి దేశాలతో ఒప్పందాలు చేస్కున్నాం. భవిష్యత్తులో ఎవరైనా క్రీడల్లో శిక్షణ కావాలంటే తెలంగాణకు వచ్చే పరిస్థితి రావాలి. ప్రపంచం తో పోటీ పడే శక్తి ,యుక్తి దేశాంలో ఉంది. తెలంగాణలో 1 కోటి 50 లక్షల ఎకరాలలో ఎక్కడ గంజాయి మొక్క మొలిసిన ఈగల్ పట్టుకుంటుంది. ఈ eagle (గద్ద) కఠీనంగా ఉంటుందాన్ని, ఎవర్నీని ఉపేక్షించేదేలేదని తేల్చి చెప్పారు.
సినీ ప్రముకులు
తెలంగాణ ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చేర్మెన్ దిల్ రాజు మాటాల్డుతూ ఫిల్మ్ ఇండస్ట్రి లో ఎవరైన డ్రగ్స్ తీస్కున్నరని నిర్దారణ అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి బహాహిష్కరించే ప్రక్రియ తీసకొస్తామన్నారు. సినిమా హీరో చిరంజీవి తనయుడు ఆస్కార్ గ్రహీత రామ్ చరణ్ మాట్లాడుతూ అప్పుడు మాకు పిల్లలు లేరు, ఇప్పుడు మేము పేరెంట్స్ మాకు బాద్యత ఉంది. ఒక్క తండ్రిగా రాష్ట్రం గురించి కానీ,సిటీ గురించి కానీ, స్కూల్ గురించి కానీ ఆలోచించాల్సి వస్తుంది. రేపు పొద్దున మా పిల్లల్ని కూడా బయటకి పంపాలంటే బయ్యంగా ఉంటుంది.
యాంటీ డ్రగ్స్ డే సందర్బంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ యువత హెల్త్ మరియు మనీ ,సక్సెస్ ,రెస్పెక్ట్ ఇవి మనిషికి ముఖ్యం. డ్రగ్స్ తీస్కోవడం వల్ల మనిషికి దూరమవుతాయి. హెల్త్ లేకపోతే జీవితంలో ఏమి చేయలేము. మన అమ్మ నాన్న గౌరవంగా ఉండలే మరియు సంతోషంగా ఉండాలి. డబ్బులు ఉంటే కంఫోర్ట్ ఉంటుంది. నేను డబ్బులు లేని జీవితాన్ని చూసిన డబ్బులు ఉన్న జీవితాన్ని చూసిన డబ్బులు మనకి అన్నీ ఇస్తుంది. 30 సంవస్తరాలలోనే మన జీవితనని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఏజ్ లో తీసుకుంటున్నా నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీస్కోవాలి. దీని ప్రభావం మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అని హీరో విజయ్ దేవరకొండ యూత్ ని ఉద్దేశించి మాట్లాడారు.
బిజేపి ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి
ఈ కార్యక్రమం లో బిజేపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతు ఇక్కడ ఎంతో మంది ఐకాన్స్ ఉన్నారు . రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి సిగరెట్ తగాడు , డ్రగ్స్ తీసుకొడు,మద్యం తాగడు ఆయనకు ఎలాంటి అలవాటు లేని కూల్ వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాట్లాడారు. ఆయనకు హెప్ ఇచ్చేదీ ఫూట్ బాల్ ఆడటం అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తన ఉన్నత స్థితికి చేరాలంటే మత్తు పార్ధరదలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. యువత తప్పు దారి పట్టకుండా మత్తు పదార్దాలకు బానిసలుగా మారకుండా దేశ పురోగతికి ప్రతి ఒక్కరూ పలుపాడాలని ఆయన అన్నారు. ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను ఉద్ధేశించి అన్నారు.
గతంలో డ్రగ్స్ ఏకువ శాతం సినిమా హిరోలు మరియు నటుల మీద ఎక్కువగా కేసులు అయ్యాయి. ఎంతోమంది నటులు వారి జీవితాన్ని నాశనం చేస్కున్నారు. ఇపుడు గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ప్రతి ఊరిలో కనిపిస్తుంది. ఇది యుక్త వయసులో ఉన్న యువత గంజాయికి ఆకర్షితులు అవుతున్నారు. ఇంటి దగ్గర తల్లి దండ్రులు కూడా తమ పిల్లల పట్ల అవగాహనతో ఉండాలి. వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ తమ పిల్లల్ని కాపాడుకోవాలి.ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనాకు సహకరించాలి.
డ్రగ్స్ మరియు గంజాయి ప్రభావం
గంజాయి మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్దాలు వాడకం ద్వారా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మాదక ద్రవ్యాలు వినియోగించం ద్వారా మానసిక వత్తిడి, ఆరోగ్యం పై నియంత్రణ లేకపోవడం,మతి మరుపు, నిద్రలేమి సమస్యలు వస్తాయి. దిన్ని ప్రభావం వల్ల కాలు,చేతులు వణకటం వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో డ్రగ్స్ వినియోగం పేరుగడంతో మూర్ఛ వ్యాది వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం పై ప్రభావం
డ్రగ్స్ మరియు గంజాయి వంటి మత్తు పదార్ధాలు మనిషి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మానసిక స్థితి దెబ్బతీస్తాయి. దిన్ని ప్రభావం చెడు ఆలోచనలను రేపుతాయి. డ్రగ్స్ వినియోగం ద్వారా శరిరంలో అనేక మార్పులు చోటుచేకూంటాయి. డ్రగ్స్ ను ముక్కు మరియు నోటి ద్వారా పిలుస్తారు. దీన్నీవాల్ల ముక్కులో శ్వాసకోశ రంద్రాలు దెబ్బతింటాయి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ మరియు జబ్బులు వస్తాయి. నోటి ద్వారా తీసుకుంటే జీర్ణన క్రియ సమస్యలతో పాటు కాలేయం దెబ్బ తింటుంది. ముక్కు ద్వారా పొగరూపంలో తీసుకుంటే శ్వాసకోశ నాళాలు మరియు ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ఐవి , హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ ఎక్కువ గా వినియోగించడం వల్ల మూర్ఛరోగం వస్తుంది.
సామాజిక ప్రభావం
మనిషికి సంతోషాన్ని తినడం,పాటలు వినడం ఏదైనా చూడడం వంటి వాటి వల్ల వచ్చేవి. డ్రగ్స్ మరియు గంజాయి అలవాట్లు పిల్లల మానసిక ఒత్తిడి ప్రభావమో లేక తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లనో లేక తోటి వారి ప్రభావం వల్లనో యువత మత్తుకు బానిసలు అవుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం మొదట్లో సంతోషాన్ని ఇచ్చిన రాను రాను మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చుపిస్తుంది. మొదటిల దీన్ని ప్రభావం లేకపోవడంతో ఇక కావాలనే ఆలోచన కలుగుతుంది. ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడులోని నరాలు దెబ్బతింటాయి. అది లేకుంటే ఉండలేని పరిస్తితి వస్తుంది. మన మెదడులో డోపమైన అనే ద్రవం విడుదల అయిన్నవుడు సంతోషం కలుగుతుంది. డోపమైన సాదారణ స్తితికి వస్తుంది. ఎక్కువగా డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా డోపమైన సాదారణ స్తితికి రాదు. అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకోవాలనే ఆలోచన ప్రేరేపితం అవుతుంది. ఇది “డ్రగ్స్ అడిక్షన్” అయ్యే అవకాశం ఉంటుంది.
చికిత్స
వీరికి మొదటగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వారు వినియోగించిన మత్తు పదార్దాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా మందులు ఇస్తారు. క్రమంగా మందుల వాడకం తగిస్తారు. వారు సాదారణ స్తితికి వచ్చేల చికిత్స చేస్తారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుతారు. మాదక ద్రవ్యాల వైపుకు ఆకర్షించే అంశాలకు దూరంగా ఉండెందుకు చర్యలు తిసుకుంటారు. వారికి వల్ల లక్ష్యాల పట్ల అవగాహన చేస్తారు. మాదక ద్రవ్యాలకు ఆరు నెలల పాటు దూరంగా ఉంచి చికిత్స చేస్తారు.
1 thought on “తెలంగాణ డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలనకు కొత్తగా “ఈగల్ ఫోర్స్””
రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది…