IBOMMA సృష్టి కర్త…. ఇమ్మడి రవి అరెస్ట్….?
ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీ ఎదురుకుంటున్న సమస్య సినిమా పైరసీ. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి సినిమాను పైరసి చేసి మార్కెట్ లో సీడీ రూపంలో అమ్మేవారు. ఈ సినిమా వాళ్ళు ఎన్నోసార్లు పైరసి భూతం పై పోరాటం చేసారు. అయినా ఫలితం లేకుండా పోయింది. రాను రాను కాలం మారుతునాపటికి కాలంతో పాటు పైరసి చెసే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతూ సిడి రూపంలో ఉన్న సినిమా పైరసిని వెబ్సైట్ లోకీ మార్చారు. దీన్ని వల్ల ప్రజలకి దగ్గర అవ్వలేనే సంకల్పంతో ఒక్క క్లిక్ తో అందరికి అందుబాటులో ఉండేలా చేశారు. ఇది ఉండగా కొత్తగా కోవిడ్ తరువాత OTT platform వంటివి ఎక్కువ అవ్వడంతో వాటికీ సబ్స్క్రిప్షన్ కూడా పెట్టడం తో అన్ని సినిమాలు ఒకే ప్లాట్ ఫామ్ లో దొరకడం కష్టంగా ఉంది.
అలాగే సినిమా థియేటర్ లో కూడా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు రూ.1500 పెట్టాల్సి వస్తుంది. ఇలా ఒక్క సినిమాకి ఇంతింత ఖర్చు పెట్టె పరిస్థితి లో మధ్యతరగతి కుటుంబాలు ఉండవు. మరి దీంట్లో ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ మధ్యలో పాప్ కార్న్వంటి రేట్లు అధికంగా ఉంటాయి. సినిమా కీ అయ్యే ఖర్చు కంటే పాప్ కార్న్ కీ అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
ఇదే క్రమంలో ఐబొమ్మ, బాప్పం, మూవీరుల్స్, వంటి వెబ్సైట్ వచ్చి మధ్యతరగతి వారికి అన్ని సినిమాలను ఒకే ప్లాట్ ఫామ్ లో తీసుకొచ్చాయి. అది కూడా ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా కొత్త సినిమాలను చూసే అవకాశం కల్పించారు.
OTT ప్లాట్ ఫామ్
ఒక్క మధ్యతరగతి వ్యక్తికీ ఎటువంటి OTT ప్లాట్ ఫామ్ ఖర్చు లేకుండా కొత్తగా విడుదల అయినా ఏ సినిమా అయినా మొత్తం కుటుంబం కలిసి ఇంట్లోనే చూసుకోవచ్చు. ఈ ఐబొమ్మ ఇంతల సక్సెస్ అవడానికి గల కారణం ఉచితంగా సినిమాలు ఇస్తునందుకు కాదు. ఐబొమ్మ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కంటే యూసర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మంచి HD తో పాటు ఒక్క క్లిక్ తో మూవీ చూసేంత ఫ్రెండ్లీగా ఉంటుంది.
IBOMMA వెబ్సైట్లో ఎటువంటి లింక్స్ ఉండవు. ఎటువంటి పాప్ అప్ విండోస్ ఉండవు. యాడ్స్ కూడా ఉండవు. త్వరగా లోడింగ్ అవుతుంది. ఒక్క లీగల్ యాప్ లో సినిమా చూసే కంటే ఐబొమ్మ లో చూడడం చాలా సులువు.
ఇలాంటి వెబ్సైట్ ల మీద సినీ పెద్దలు ఎన్నో సార్లు పోలీస్ లకు కంప్లైంట్స్ ఇచ్చారు. సినీ నిర్మాతలు ఎన్నో కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలను ఇలా ఫ్రీగా వెబ్సైట్ లో పెట్టడం వల్ల సినిమా థియేటర్ కీ వచ్చే ప్రజల సంఖ్య పూర్తిగా తగిపోయింది. దీన్ని వల్ల సినీ నిర్మాతలకు అధిక మొత్తంలో నష్టాన్ని చవిచుడాల్సి వస్తుంది. ఒక్క సంవత్సరానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ కీ 3700 కోట్ల నష్టం వస్తుంది. సినిమా నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
OTT ప్లాట్ ఫామ్ ఫెయిల్యూర్ ఇక్కడే ఒక్క పెద్ద హీరో సినిమా ఒక్క OTT యాప్ లోనే విడుదల అవుతుంది. ఆలా ఒక్కొక్క హీరో సినిమా వేరు వేరు OTT ప్లాట్ ఫామ్ లో విడుదల అవడం వల్ల ఇలా అన్ని ప్లాట్ ఫామ్ కలిపి సగటున మధ్యతరగతి వ్యక్తి కీ నెలకు సుమారు 1500 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. ఇలా మధ్యతరగతి కుటుంబం వినోదల కోసం నెలకు రూ.2000 ఎందుకు ఖర్చు పెట్టాలి అనే దానికి సినిమా ఇండస్ట్రీ దగ్గర సమాధానం లేదు. ఈ అసంతృప్తిని ఐబొమ్మ తెలీవిగా వాడుకుంది.
ఐబొమ్మ సృష్టి కర్త ఇమ్మడి రవి. ఇతనిది విశాఖపట్నం. 2016 లో ఓ యువతిని ప్రేమించిన ఇమ్మడి రవి. అయితే రవి భార్య ఉన్నతమైన కుటుంబం నుండి రావడంతో రవి వచ్చే అరకొర సంపాదన చూసి రవి కీ డబ్బు సంపాదించడం రాదు అని అతనికి ఏది చేతకాదని రవి భార్య ఆమె తల్లి రవిని అవహేళన చేసేవారు. దానితో వెబ్ డిజైన్ నేర్చుకొని ఐబొమ్మ, బప్పం వంటి వెబ్సైటులను సృష్టించి దంట్లో సినిమాలు అప్లోడ్ చేసేవాడు. దాంతో మంచి ఆదరణ రావడంతో బెట్టింగ్ అప్స్ మరియు యాడ్స్ ద్వారా కోట్ల డబ్బులు సంపాదించినాపటికి తన భార్య తనతో ఉండటం నిరకరించడంతో వీరికి 2021 లో విడాకులు అయ్యాయి. దాని తరువాత తన ఐడెంటిని మార్చుకొని నెదర్లాండ్ కు మకాం మార్చాడు.
ఇతను మొదట్లో కొత్తగా వచ్చే సినిమాలను అందరి కంటే ముందుగా చూడాలనే ఉత్సహంతో సినిమా సంబందించిన సర్వర్లను హాక్ చేసి సినిమాలు చూసే వాడు. ఇలా కొన్ని రోజులకు ఐబొమ్మ వంటి మొత్తం 69 వెబ్సైట్లను క్రియేట్ చేసి ఆన్లైన్ లో పెట్టె వాడు. ఇలా చేయడానికి చాలా పెద్ద నెటవర్క్ కావాలి. వాళ్లందరికీ జీతాలు కూడా ఇవ్వాలి. వీళ్లకు డబ్బులు ఎలా వస్తాయి అంటే మనం చూసే సినిమాలు దంట్లో బెట్టింగ్ ప్రమోషన్స్, అలాగే గేమింగ్ ప్రమోషన్స్ వల్ల విలకి డబ్బులు వస్తాయి.
కొన్ని రోజుల క్రితం పోలీస్లు ఐబొమ్మ సైట్ ని ముసివేయ్యడానికి ప్రయత్నించినపుడు పోలీసులకు, సినిమా ఇండస్ట్రీ కీ ఒక్క ఛాలెంజ్ విసిరాడు. మా వెబ్సైట్ మీద ద్రుష్టి పెట్టడం ఆపండి. లేకుంటే మేము మీరు డిపాట్మెంట్ పై ద్రుష్టి పెట్టాల్సి వస్తుంది అని బెదిరింపు సందేశాన్ని పంపించాడు. ఈ ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కీ కోపం తెపించింది. జూన్ 2025 లోనే ఐబొమ్మ ని పట్టుకోవాలని పోలీసులు వేట మొదలు పెట్టారు.
ఇతను ఈ స్కాంలు చేయడానికి ముందు తన ఐడెంటీని మార్చుకున్నాడు. పోలీసులు ఎవరు పట్టుకోకూడదు. మహారాష్ట్ర వెళ్లి వెళ్లాలా ప్రహ్లాద్ కుమార్ గా పేరు మార్చుకొని ఒక్క ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ పాన్ కాడ్ సృష్టించాడు.చట్టం దృష్టిలో రవి వేరు, ప్రహ్లాద్ వేరు. ఇమ్మడి రవి తన నెట్వర్క్ సర్వర్లను ఇండియాలో పెట్టలేదు.ఇమ్మడి రవి ఎంచుకున్న తన నెట్వర్క్ సర్వర్లను దాచుకోవడానికి అమెరికా, నెదర్లాండ్, స్విజర్లాండ్ డేటా సర్వర్లను పెట్టడానికి భద్రంగా ఉంచడానికి ఉపయోగించుకున్నాడు.
ఐబొమ్మ ఎప్పుడు తన సర్వర్లను ఆక్టివ్గా ఉంచే వాడు. పోలీసులు ఒకవేళ ఐబొమ్మ ను బ్లాక్ చేసిన ఐబొమ్మ కు సంబందించిన మరో వెబ్సైట్ ను అందుబాటులో ఉంచే వాడు. మొత్తం 65 వెబ్సైట్లను ఒకేసారి రన్ చేసేవాడు. ఇలా ఐబొమ్మ ఎప్పుడు కూడా సర్వర్ల కింద పడలేదు. ఇమ్మడి రవి ఐబొమ్మ వెబ్సైట్ లో ఏకంగా 21000 సినిమాలను అప్లోడ్ చేశాడు. ఇలా రోజు సినిమాలు చూసే వారి 5కోట్ల మంది డాటాను తన దగ్గర ఉందని చెప్పాడు.
IBOMMA ఇండియా ఏజెంట్లు అరెస్ట్
తాను ఒక్క కోటను నిర్మించుకొని నన్ను ఎవరు పట్టుకోలేరు అనే అహం తో పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని హైదరాబాద్ పోలీస్ సిపీ సజ్జనార్ అన్నారు.ఈ కేసు లో ఇంతకు ముందే ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ వీళ్ళే ఇమ్మడి రవి యొక్క ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్న ఏజెంట్లు.
అయితే ఇమ్మడి రవి అరెస్ట్ వెనుక తాను ఎలా అరెస్ట్ అయ్యాడానేది తాను ఇండియా కీ ఎందుకు వచ్చాడు అనేది ఇంకా తెలియాల్సిన ఉంది. రవి ఐబొమ్మ ద్వారా 20 కోట్లు సంపాదించాడని సీపీ సజ్జనార్ చెప్పారు. దీంట్లో అందరూ షాక్ అయ్యే విషయం ఏమిటీ అంటే 50 లక్షల సబ్స్క్రైబార్ల డాటా అతని దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న డాటా డార్క్ వెబ్సైట్ వాళ్లకు అమ్మేశాడ లేక ఎక్కడ స్టోర్ చేశారు, అనేదాన్ని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని వల్ల సామాన్య ప్రజలు భవిష్యత్తులో ఎన్నో రకాలుగా సమస్యలు ఎదురుకోవచ్చు. వాళ్ళు ఆ డాటా ను డార్క్ వెబ్సైట్ వాళ్లకు అమ్మితే అనవసరమైన ఫోన్ కాల్స్ రావడం, ఫ్రాడ్ కాల్స్ తో లింక్స్ పంపించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇమ్మడి రవిని పోలీసులు ఎలా పట్టుకున్నారంటే రవి కీ తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేవు. రవి గురించి పోలీస్ టీం వెతుకుతున్న క్రమంలో రవి స్నేహితుడు కోసం వెతికారు. ఇలా వెతికే క్రమంలో రవి స్నేహితుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు అనే సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అదే సమయంలో రవి నుండి తన స్నేహితుడికి వాట్సప్ మెసేజ్ చేయడంతో అదే సమయంలో రవి హైదరాబాద్ కు వచ్చానాని మెసేజ్ చేశాడు. ఈ ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ కవిత చెప్పారు.
మొత్తానికి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుండి 3 కోట్ల నగదు, 21000 సినిమాల హార్డ్ డిస్క్లు, అలాగే 50 లక్షల డాటా మొత్తం పోలీసులు సీజ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా మీమ్ పోస్ట్లు పెట్టె వారిమీద కూడా కేసులు పెడుతామని హైదరాబాద్ పోలీస్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.



